Header Banner

పదో తరగతి ఫలితాల బిగ్ ట్విస్ట్! జీవోలో ఏమి ఉందంటే!

  Wed Apr 16, 2025 10:17        Education

పదో తరగతి ఫలితాల కోసం విద్యార్ధులు నిరీక్షిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తయింది. తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితా లను విడుదల చేసారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 24న విడుదలకు నిర్ణయం తీసు కొన్నారు. కాగా, పదో తరగతి ఫలితాలను ఏపీలో ఈ నెల 22న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం కీలక అంశం పైన ప్రభుత్వ స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఆ క్లారిటీ వచ్చిన తరువాతనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

 

ఏపీలో పది ఫలితాలు

ఏపీలో పదో తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్ పూర్తయింది. మార్కుల గ్రేడింగ్ ప్రక్రియ కొనసా గుతోంది. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే ఏప్రిల్ 22వ తేదీన టెన్త్‌ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇంటర్ ఫలితాల తరహాలోనే పదో తరగతి ఫలితాల వెల్లడి.. మార్కులను ప్రత్యేకంగా వాట్సప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ పూర్తయిన తరువాత అధికారికంగా విడుదల ముహూర్తం వెల్లడించనున్నారు.


తుది కసరత్తు

తెలంగాణలోనూ పదో తరగతి మూల్యాంకనం పూర్తి చేసారు. మార్కుల జాబితాలను సిద్దం చేస్తు న్నారు. వచ్చే వారం ఈ ఫలితాల విడుదలకు అధికారులు తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ సారి ఫలితాల వేళ ప్రభుత్వం నుంచి కీలక అంశం పైన స్పష్టత రావాల్సి ఉంది. పదో తరగతి లో గ్రేడింగ్ విధానం తొలిగించి.. మార్కులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక.. మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దాని పైన స్పష్టత ఇవ్వలేదు. దీని పైన స్పష్టత ఇస్తేనే ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్ పూర్తయినా.. ఈ అంశం పైన క్లారిటీ వస్తే మార్కుల జాబితాలను సిద్దం చేసి.. ఫలితాలను వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

  

ఫలితాల విడుదల వేళ

ప్రభుత్వం ఈ అంశం పైన వెంటనే స్పష్టత ఇస్తే వచ్చే వారం.. ఆలస్యం అయితే నెలాఖరు లోగా ఫలితాలు విడుదల అవుతాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పదో తరగతిలో గ్రేడింగ్ రద్దు చేసిన ప్రభుత్వం అంతర్గత మార్కులు (20) కొనసాగించింది. అంతర్గత మార్కులను వచ్చే ఏడాది నుంచి తొలిగించటం వలన మార్కులు తగ్గే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా తమ సంస్థల పైన పేరెంట్స్ లో మరో రకమైన అభిప్రా యం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, గ్రేడింగ్ విధానం కొనసాగించాలని.. మార్కుల ను ప్రవేశ పెడితే కార్పోరేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతాయని ప్రభుత్వానికి వినతులు అందాయి. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడిస్తే... పదో తరగతి ఫలితాలు వెల్లడికి మార్గం సుగమం కానుంది.

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #10thResults2025 #SSCResults #TelanganaResults #APResults